Children Going to School Crossing the Canal: చదువుకోవాలంటే సాహసం చేయాల్సిందే.. ఇంకెన్నాళ్లు ఈ కష్టాలు - వంతెన కష్టాలపై వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2023, 9:22 PM IST
Children Going to School Crossing the Canal: స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా.. ఆ ప్రాంత ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. ప్రకృతికి దగ్గరగా.. పట్టణానికి దూరంగా బతుకుతున్న.. ఇక్కడి వారి గోడు ప్రభుత్వాలకు పట్టడం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నేటికీ వారికి బడి చదువులు అందని ద్రాక్షగా మారుతున్నాయి. చదువు కోవాలంటే కాలువలు, వాగులు దాటి చదువు కోసం వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల్ని చదివించాలని ఉన్నా.. కొందరు తల్లిదండ్రులు వారి భద్రతపై భయంతో స్కూల్కు పంపించడం లేదు. మరి కొంతమంది మాత్రం తమ పిల్లల భవిష్యత్తు కోసం కాలువను దాటించే ప్రయత్నం చేస్తూ.. వారిని స్కూల్కు పంపిచే ప్రయత్నాలు చేస్తున్నారు.
తమ గ్రామానికి వంతెన లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, తమ పిల్లలు స్కూల్ వెళ్లడానికి దినదినగండంలా మారుతుందని.. మన్యం జిల్లా ముంచంగిపుట్టు మండలంలో లక్ష్మీపురం, తుముడిపుట్టు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడం వలన విద్యార్థుల తల్లిదండ్రులు పిలల్ల్ని ఇలా వాగు దాటిస్తునారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తుముడిపుట్ వద్ద వంతెన నిర్మించి తమ కష్టాలను తీర్చమని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.