Street Names Changes ఇలా.. ఓ పద్దతి లేకుండా పేర్లు మార్చేస్తే ఎలా! వీధి పేరు మార్పుపై వివాదం! - గుంటూరు నగరంలో వీధుల పేర్లు మార్పు వివాదం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18416451-468-18416451-1683174965424.jpg)
People Angry On Streets Name Changes In Guntur City : గుంటూరు నగరంలో స్థానిక వీధుల పేర్ల మార్పు స్థానిక ప్రజల్లో కలకలం రేపుతోంది. గుంటూరు నగరంలో ఏటీ అగ్రహారంలోని రెండు వీధులకు ఫాతిమా నగర్ అంటూ కార్పొరేట్ సిబ్బంది బోర్డులు ఏర్పాటు చేశారు. బోర్డులు ఏర్పాటు చేయడంలో స్థానికులలో అభ్యంతరాలు వెల్లువెత్తుతుతున్నాయి. కార్పొరేట్ సిబ్బందికి ఫిర్యాదు చేసిన అధికారులు బోర్డులను తొలగించలేదు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు స్టిక్కర్లను చింపివేసి తొలగించారు. వాటి స్థానంలో యథాతధంగా ఏటీ ఆగ్రహారం ఒకటవ, రెండవ వీధి, అంటూ రాసి ఉంచారు. సమీపంలోని శ్రీరామ్‌నగర్ పేరు కూడా చైతన్య నగర్‌గా పేరు మార్చడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిల్ తీర్మానం లేకుండా పేరు ఇలా మార్పు సరి కాదంటూ స్థానిక ప్రజలు చెప్పుకొస్తున్నారు. దీంతో వీధుల పేరు మార్పుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ చదవండి