లోకేశ్‌కు అభినందనలు, పవన్ కల్యాణ్‌కి ధన్యవాదాలు : చంద్రబాబు నాయుడు ట్వీట్ - Yuvagalam public meeting in Vizianagaram district
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 3:45 PM IST
Chandrababu Tweet on Lokesh and Pawan Kalyan: యువగళం ముగింపు సందర్భంగా విజయనగరంలోని పోలిపల్లిలో జరిగిన భారీ బహిరంగ సభ విజయవంతమైన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ట్విటర్ (X) వేదికగా స్పందించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోసం కసితో ఉన్నారని యువగళం నవశకం సభ ప్రపంచానికి చాటిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రం పూర్వ వైభవంగా మారాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.
తెలుగుదేశం - జనసేన కూటమిపై ప్రజలు ఏపాటి విశ్వాసం ఉంచారో స్పష్టమైందని పేర్కొన్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్న చంద్రబాబు, రాష్ట్రానికి పూర్వ వైభవం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలుగుదేశం - జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్‌ని పునర్నిర్మిస్తుందన్నారు. యువగళం విజయవంతంగా పూర్తి చేసినందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు అభినందనలు తెలిపారు. పోరాటంలో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి ఎక్స్ (ట్విటర్) వేదికగా ధన్యవాదాలు తెలిపారు. యువగళం నవశకంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ చంద్రబాబు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.