Chandrababu Traveled by RTC Bus: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన చంద్రబాబు.. మహిళలతో మాటామంతీ - AP Latest News
🎬 Watch Now: Feature Video
Chandrababu Traveled by RTC Bus in Alamuru: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. చంద్రబాబు పర్యటనలో దారి పొడవునా అభిమానులు గజమాలలతో స్వాగతం పలిగారు. మార్గమధ్యలో జనంతో మమేకమవుతున్నారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు నుంచి జొన్నాడ వరకు చంద్రబాబు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. భవిష్యత్‌కు గ్యారెంటీ పర్యటనలో భాగంగా చంద్రబాబు బస్సులో ప్రయాణించి మహిళలతో మాటామంతీ జరిపారు. బస్సులో ఉన్న మహిళలలు ఈ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. మహిళలు తమ సమస్యలను వివరిస్తూ.. ప్రభుత్వ పన్నులపై, నిత్యావసర వస్తువుల ధరలపై ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయని.. అవి చాలా భారంగా మారాయని వాపోయారు. ఈ ప్రభుత్వంలో సామాన్యులు బతకడం చాలా కష్టంగా ఉందని.. ప్రభుత్వం విధించే పలు రకాల పన్నులు చాలా భారంగా మారుతున్నాయని వారు వాపోయారు. టీడీపీ ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణంపై వారు హర్షం వ్యక్తం చేశారు. మహిళలకు సూపర్ సిక్స్ పథకాల్లో ప్రకటించిన మహా శక్తి పథకం లబ్ధిని చంద్రబాబు వివరించారు.