thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2023, 10:17 PM IST

ETV Bharat / Videos

Chandrababu Receives an Extraordinary Welcome: వేలాదిగా రోడ్లపైకి జనం.. చంద్రబాబుకు ఘన స్వాగతం

Chandrababu Receives an Extraordinary Welcome: రాజమండ్రి జైలు నుంచి విడుదలై వస్తున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుపై టీడీపీ నేతలు, శ్రేణులు రోడ్లపైకి వచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజల అభిమానంతో  జైలు వద్ద బయలుదేరిన చంద్రబాబు కాన్వాయ్  2 గంటలైనా...రాజమండ్రి దాటలేకపోయింది. అనంతరం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఘనస్వాగతం పలికారు. సెంటర్లో గజమాలతో కార్లో ఉన్న చంద్రబాబుకు సత్కారం చేశారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో... రావులపాలెం సెంటర్ కిటకిటలాడింది. 

తణుకులో తెలుగుదేశం నేత ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబుకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  ప్రజలు చంద్రబాబును చూసేందుకు తణుకు పరిసరాల నుంచి తరలివచ్చారు. తూర్పు గోదావరి జిల్లా పెరవలిలో చంద్రబాబుకు బూరుగుపల్లి శేషారావు, కుందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. చంద్రబాబును చూసేందుకు ట్రాక్టర్లు, బైకులపై కార్యకర్తలు తరలివచ్చారు. చంద్రబాబును చూసేందుకు జనం రోడ్డుపై బారులు తీరడంతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి వ్యవహరిస్తున్న చంద్రబాబు... కారు లోపల నుంచే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.