నేడు ఆళ్లగడ్డలో బాబు 'రా కదలి రా' - Ra Kadali Ra program
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 9, 2024, 11:37 AM IST
|Updated : Jan 9, 2024, 2:44 PM IST
Chandrababu Ra Kadali Ra Public Meeting Schedule: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం- జనసేన పార్టీలు నిర్వహిస్తున్న "రా కదలి రా" (Ra Kadali Ra) భారీ బహిరంగ సభ నేడు నంద్యాల ఆళ్లగడ్డలో జరగనుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు (CBN) గుంటూరు జిల్లా ఉండవల్లిలో తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం ఆళ్లగడ్డ చేరుకుంటారు. అనంతరం బాబు బహిరంగ సభలో ప్రసంగించ నున్నారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు తిరిగి ఉండవల్లికి చేరుకుంటారు.
Ra Kadali Ra Program Bobbilli on Tomorrow: బుధ వారం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ చేరుకుని బొబ్బిలిలో ఏర్పాటు చేసిన "రా కదలి రా" సభలో మాట్లడనున్నారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు హెలికాప్టర్‌లో తుని చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో రాజ మహేంద్రవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు పయనం అవుతారు.