టీడీపీ ప్రచారపర్వం - జనవరి 5 నుంచి చంద్రబాబు బహిరంగ సభలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 9:03 PM IST
Chandrababu Naidu Public Meetings Updates: ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనవరి 5వ తేదీ నుంచి పార్లమెంట్ స్థానాల వారీగా బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. 25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
Chandrababu Public Meetings Start from January 5: సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కొత్త ఏడాది (జనవరి 5) నుంచి పార్లమెంట్ స్థానాల వారీగా బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలు పెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. 25 బహిరంగ సభల నిర్వహణ, కార్యక్రమాలు, రూట్ మ్యాప్‌నకు సంబంధించిన ప్రణాళికలను ఆ పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి సభకు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ స్థానంలో బహిరంగ సభను ఏ అసెంబ్లీ స్థానం పరిధిలో నిర్వహించాలి? ఏయే రోజున ఏయే కార్యక్రమాలు నిర్వహించాలి? అనే విషయాలపై కమిటీ కసరత్తు చేస్తోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి రెండు ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించాలని ఇప్పటికే ఇరుపార్టీల అధినేతలు నిర్ణయించిన విషయం తెలిసిందే. తిరుపతి, అమరావతిల్లో జరిగే బహిరంగ సభల్లో ఉమ్మడి మేనిఫెస్టోను ఇరుపార్టీల అధినేతలు ప్రకటించే అవకాశం ఉంది.