CBN Tour: టీడీపీ అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల పర్యటన.. తేదీలు ఖరారు.. - చంద్రబాబు పర్యటన
🎬 Watch Now: Feature Video
Chandrababu Projects Tour Dates Confirmed: తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు రూట్ మ్యాప్ ఖరారయ్యింది. ఆగస్టు ఒకటో తేదీన ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు, మచ్చుమర్రి, బంకచర్ల ప్రాజెక్ట్‌లను పరిశీలించనున్నారు. అదే రోజున నందికొట్కూరులో రోడ్ షో నిర్వహించి.. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆగస్టు 2వ తేదీన కొండాపురం ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న ఆయన.. అదే రోజు పులివెందులలో రోడ్ షో నిర్వహించి.. పూల అంగళ్ళ సర్కిల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆగస్టు 3వ తేదీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, గొల్లపల్లి రిజర్వాయర్లను పరిశీలించనున్నారు. అదే రోజు పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని కీయా కార్ల పరిశ్రమను సందర్శించనున్నారు. నాలుగో రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు బ్రాంచ్ కెనాల్ సందర్శించిన అనంతరం పూతలపట్టులో రోడ్ షో నిర్వహించి.. బహిరంగ సభలో పొల్గొననున్నారు. పెన్నా టు వంశధార పేరుతో చంద్రబాబు ఆగస్టు 1 నుంచి పది రోజుల పాటు ప్రాజెక్టుల సందర్శన చేయనున్న విషయం తెలిసిందే.