ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు - రైతులకు ఆర్థిక సహాయం - Michaung Cyclone Affected

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2023, 3:29 PM IST

Chandrababu Help to Michaung Cyclone Affected Farmers : బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చారు. మిగ్ జాం తుపానుతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఆ పార్టీ నాయకులు ఆర్థిక సాయం అందజేశారు. ఈ నెల 9న జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో వరదకు దెబ్బతిన్న పంటలను చంద్రబాబు నాయుడు పరిశీలించారు. చెరుకూరులో తుఫాన్​ కారణంగా నీట మునిగిన పంటలు, రైతుల పరిస్థితిని చూసి చలించిపోయిన చంద్రబబాబు, వారికి ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. 

Cyclone Affected Farmers in Bapatla District : ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సూచన మేరకు ఆ పార్టీ నాయకులు చెరుకూరు వెళ్లి రైతులకు నగదు అందజేశారు. మిరప, మొక్కజొన్న, పొగాకు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన గడ్డం శ్రీనివాసరావుకు 2 లక్షలు రూపాయలు, ఎడ్ల నారాయణస్వామికి 2.05 లక్షల రూపాయలు, కత్తి భూషికి 50 వేల నగదు, జి. చిరంజీవికి 25 వేల నగదును అందించారు. కష్ట సమయంలో తమను ఆదుకున్న చంద్రబాబు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఉషారాణి, పలువురు నేతలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.