Chandrababu Fires on YSRCP at Kalyanadurgam: వైసీపీ అరాచక పాలన.. 'సేవ్ ఆంధ్రప్రదేశ్' ప్రతి ఒక్కరి నినాదం కావాలి: చంద్రబాబు - cm jagan x chandrababu
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 6, 2023, 10:38 PM IST
Chandrababu Fires on YSRCP at Kalyanadurgam: వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేది.. ప్రతి ఒక్కరి నినాదం కావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరెంట్ కోతలు లేని గ్రామం లేదని.. టీడీపీ అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని 'బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారంటీ' కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా కల్యాణదుర్గం బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు హామీ ఇచ్చారు.
తనను అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని.. ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని చంద్రబాబు అన్నారు. యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలను రాష్ట్రానికి తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. సంపద సృష్టించి ప్రజలకే ఇస్తానని.. ప్రజలను బాగు చేయటానికే సంపదను వినియోగిస్తామని వివరించారు. బాంబులకే భయపడని బాబు.. బెదిరింపులకు భయపడడు అని అన్నారు. 180 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషిన్లను తీసుకువస్తే.. ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో తుప్పు పట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు.