టీ పొడి కోసం వచ్చి - బంగారు గొలుసుతో ఉడాయించాడు
🎬 Watch Now: Feature Video
Chain Snatching in Uravakonda : మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని శివరామిరెడ్డి కాలనీలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉరవకొండ పట్టణంలోని శివరామిరెడ్డి కాలనీలో ప్రతిమ అనే మహిళ ఇంటి ముందరే చిన్నపాటి కొట్టును నిర్వహిస్తోంది. రాత్రి దుండగుడు ముందుగా చిన్న పెరుగు ప్యాకెట్ కొనుక్కుని వెళ్లాడు. ఆ దుకాణం వద్ద ఎవరూ లేని విషయాన్ని గుర్తించి కాసేపటికి మళ్లీ వచ్చి టీ పొడి ఇమ్మని అడిగాడు. ఆమె దానిని ఇవ్వడానికి వెనక్కి తిరిగింది. ఈ క్రమంలో కొట్టు ముందు ఉన్న చిన్న స్టూల్‌ను ఎక్కి దుండగుడు అమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని పరుగులు (Chain Snatching) తీశాడు.
Gold Chain Theft From Woman Neck In Anantapur District : ఆమె గట్టిగా అరవడంతో స్థానికులు గుమిగూడి దుండగుని అచూకీ కోసం ప్రయత్నించారు. ఇంతలో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దొంగ కోసం గాలింపు చేపట్టారు. బాధితులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో శివరామిరెడ్డి కాలనీలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం జన సంచారం అధికంగా ఉండే కాలనీలో చైన్ స్నాచింగ్ చోటు చేసుకోవడం చర్చగా మారింది.