కేెంద్ర కరవు బృందాన్ని అడ్డుకున్న రైతులు - తడిసిన పంటల ఫొటో ప్రదర్శన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 13, 2023, 3:22 PM IST
Central Team Cyclone Effected Crop Visit In Kurnool District : పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కర్నూలు జిల్లాకు వచ్చిన కేెంద్ర కరవు బృందాన్ని రైతులు అడ్డుకున్నారు. ఉదయం అనంతపురం జిల్లాలోని పంటలను పరిశీలించి వారు అక్కడ నుంచి కర్నూలు జిల్లా చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రైతులు తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు వినతిపత్రం అందజేశారు. పోలీసుల చొరవతో కరవు అక్కడ నుంచి కేెంద్ర బృందం ముందుకు కదిలింది.
Farmers Protest In Kurnool : అనంతరం పత్తికొండ మండలం చిన్నహుల్తి వద్ద తుపాను కారణంగా వానలకు తడిసిన పంటల నమూనాలతో రైతులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను చూశారు. అధికారులు వాటిని పరిశీలించి పంట వివరాలు తెలుసుకున్నారు. మిగ్జాం కారణంగా తాము పూర్తిగా నష్టపోయామని రైతులు వారి గోడు వెళ్లబోసుకున్నారు. తమకి ఆర్థిక సాయం చెయ్యాలని కోరారు. పంటలను నేరుగా పరిశీలించిన అధికారులు రైతులతో మాట్లాడి సమాచారం సేకరించారు.