400 వందేభారత్‌ రైళ్లు నడపడమే లక్ష్యం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 3:20 PM IST

Central Minister Kishan Reddy About Vande Bharat Trains: 400 వందేభారత్‌ రైళ్లను నడపాలనే లక్ష్యం దిశగా పని చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన రైళ్లను ముఖ్యమైన మార్గాల్లో నడుపుతున్నామని వివరించారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో రైల్వే రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు విజయవాడ రైల్వే ఆడిటోరియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు.

నూతన మార్గాల విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, అత్యాధునిక సాంకేతికతతో కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురావడంపై ఎక్కువ దృష్టి సారించినట్లు తెలిపారు. ఏటా 800 కోట్ల మంది రైలులో ప్రయాణం చేస్తున్నారని, 151 టన్నుల కార్గో రవాణా అవుతోందన్నారు. గత ఏడాది 5243 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గం నిర్మాణమైందని తెలిపారు. 1309 రైల్వే స్టేషన్లను అమృత్‌భారత్‌ స్టేషన్లుగా మార్పు జరుగుతోందని, రైల్వే భద్రత, కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి స్వదేశీ సాంకేతికతను వినియోగిస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మూడు లక్షల మంది యువతకి రైల్వేలో ఉద్యోగాలు కల్పించామని, వచ్చే ఐదేళ్లలో ఉద్యోగ అవకాశాలు మరింత ఎక్కువగా రాబోతున్నాయని చెప్పారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.