అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి పదవీకాలం పొడిగింపు ప్రతిపాదన తిరస్కరణ - central government
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 2, 2024, 10:17 PM IST
Central Govt Rejected Forest Officer Madhusudhan Reddy Tenure Extension: అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి (Head of Forest Force) మధుసూదన్ రెడ్డి పదవీకాలం పొడిగింపు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఎంతో రహస్యంగా మధుసూదన్ రెడ్డిని పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను కేంద్రం తిరస్కరించింది.
నవంబర్ 30న ఉద్యోగ విరమణ చేసిన మధుసూదన్ రెడ్డి: 2023 నవంబర్ 30న మధుసూధన్ రెడ్డి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ రహస్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆయన సర్వీసును పొడిగిస్తూ ఆదేశాలు ఇవ్వొచ్చన్న అభిప్రాయంతో మధు సూదన్ రెడ్డి పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలు పొడిగించేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం మధుసూధన్ రెడ్డి అనధికారికంగా పీసీసీఎఫ్ (Principal Chief Conservator of Forests) పోస్టులో కొనగుతున్నారు.