CBI EX JD Lakshmi Narayana Clarity On Next Election: పార్టీలను కాకుండా వ్యక్తులను చూసి ఓటు వేయాలి..: మాజీ జేడీ లక్ష్మీనారాయణ - వైసీపీ వర్సెస్ జేడీ లక్ష్మీనారాయణ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2023, 8:44 PM IST

CBI EX JD Lakshmi Narayana Clarity On Next Election: 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ.. లక్ష్మీనారాయణ ఉద్ఘాటించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని చూసి ఓటెయ్యాలని.. పార్టీని, కులాన్ని చూసి ఓటెయ్యొద్దని లక్ష్మీనారాయణ కోరారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు వినియోగించుకోని వారిపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘం ఆలోచించాలని లక్ష్మీనారాయణ(Lakshminarayana) సూచించారు. తాము ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకుంటున్నామా లేదా..  అనేది నాయకులు చూసుకోవాలని తెలిపారు. ఆయా పార్టీల నాయకులు  వ్యక్తగత అజెండాలతో ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో  పార్టీలను  కాకుండా వ్యక్తులను చూసి ఓటు వేయాలని సూచించారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.  గత కొంత కాలంగా ఆయా పార్టీల నేతలు  ఓటు బ్యాంక్ రాజకీయాలు(Vote bank politics)  చేస్తున్నారని  పేర్కొన్నారు. ఎన్నికల్లో  డబ్బు, కులం, మతం..ప్రభావాలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఎన్నికల ముందు ఎలాంటి సర్వేలు చేయకుండా... సర్వే చేసే సంస్థలను కట్టడి చేయాలని కోరారు.  తాను గత ఎన్నికల్లో మాదిరిగా... ఈ సారి సైతం పోటీలో నిలబడతానని.. అది ఇతర పార్టీ నుంచా లేదా స్వతంత్రంగా నా అనే అంశం ఎన్నికల సమయంలో తెలుస్తుందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. డబ్బులు ఉంటేనే రాజకీయాలు చేయగలం అనే ఆలోచనలో మార్పు రావాలని వెల్లడించారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.