కులగణన షెడ్యూల్లో మార్పులు- 'జనవరి 19 నుంచి 28 వరకూ కులగణన' - జనవరి 19 నుంచి 28కులగణన
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-01-2024/640-480-20481328-thumbnail-16x9-caste-survey-revised-schedule.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 12:45 PM IST
Caste Survey Revised Schedule: కులగణన ప్రక్రియ షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 19 నుంచి 28లోపు కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రణాళిక విభాగం ఆదేశాలు జారీ చేసింది. అందుబాటులో లేని వ్యక్తులు సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు వెసులుబాటు కల్పించింది. కులగణనలో భాగంగా సామాజిక ఆర్థిక, విద్యా, ఉపాధి అంశాలపై వివరాలు సేకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మండల, మున్సిపల్ స్థాయిలో కుల సంఘాలు, అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించాలని తహసీల్దార్లు, ఎంపీడీఓలకు గతంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కులగణన కోసం సచివాలయ సిబ్బందికి ఇచ్చే శిక్షణను జనవరి 11 తేదీలోగా ముగించాలని ఆదేశించింది. ఎన్యూమరేటర్లు, సచివాలయ సిబ్బంది, సూపర్ వైజర్ల మ్యాపింగ్ 12 తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. కులగణన ప్రక్రియ జనవరి 1 తేదీనే ప్రారంభం కావాల్సి ఉన్నా సాంకేతిక, పరిపాలనా పరమైన కారణాలతో ప్రభుత్వం వాయిదా వేసింది.