ఫ్లాట్లు, విల్లాల పేరుతో 'బూదాటి' భూదాహం - వందల కోట్ల దోపిడీ : టీడీపీ నేతలు - mangalagiri real estate case filed
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-11-2023/640-480-20147520-thumbnail-16x9-case-registered-on-sahiti-constructions-real-estate-dealer.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 30, 2023, 10:42 AM IST
|Updated : Nov 30, 2023, 12:00 PM IST
Case Registered on Sahiti Constructions Real Estate Dealer: సాహితీ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ పేరుతో స్థిరాస్తి వ్యాపారం నిర్వహిస్తున్న బూదాటి లక్ష్మీనారాయణపై కేసు నమోదయింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా సమీపంలో సాహితి కనస్ట్రక్షన్స్ ఖరీదైన విల్లాల నిర్మాణం చేపట్టింది. రాజధాని మార్పు ప్రకటనతో నిర్మాణాలు నిలిచిపోయాయి. దీనిపై అక్కడి విల్లా కోసం డబ్బు చెల్లించిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాద ప్రతివాదాలకు వేదికగా మారింది.
Argument Between YCP and TDP Leaders: బూదాటి లక్ష్మీ నారాయణ రూ.3కోట్ల 25లక్షలు తీసుకుని విల్లాలు స్వాధీనం చేయకుండా మోసం చేశారని విల్లా కోసం డబ్బు చెల్లించిన వ్యక్తులు ఫిర్యాదు చేశారు. లక్ష్మీనారాయణపై ఐపీసీ 406, 420 సెక్షన్ కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. సాహితీ కనస్ట్రక్షన్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి సన్నిహితుడని.. ఆయన సహకారంతోనే టీటీడీ సభ్యునిగా నియమితుడయ్యాడని టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఫ్లాట్లు, విల్లాల పేరుతో లక్ష్మీనారాయణ వందలకోట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. అయితే, గత ఎన్నికల్లో లక్ష్మీనారాయణ నారాలోకేశ్‌కి చందాలిచ్చారంటూ వైసీపీ అనుకూల మీడియాలో తప్పుడు కథనాలు వచ్చాయని టీడీపీ నేతలు మండిపడ్డారు.