Case in High Court on Voter List ఓ పద్దతిగా.. ఓ విధానం ప్రకారమే ఓట్ల జాబితాలో అవకతవకలు..! హైకోర్టును ఆశ్రయించిన మచిలీపట్నం వాసి..! - AP Latest News
🎬 Watch Now: Feature Video
Case in High Court on Voter List: ఓటర్ల జాబితా జంబ్లింగ్ చేయడం.. ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో కేంద్రానికి మార్చడం.. ఒక ఇంట్లో ఓట్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో వచ్చేలా చేయడం.. సున్నా ఇంటి నంబర్లతో ఓట్ల నమోదు..రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగుతున్న అంశాలివి. లోతుగా పరిశీలిస్తే ఇదంతా చాలా ప్రణాళికాబద్ధంగా.. పక్కా పథకం ప్రకారం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సంఘం నిబంధన (రూల్ 6) ప్రకారం ఇంటి నంబర్ల వరుస క్రమంలో ఓటర్ల జాబితా ఉండాలి. కానీ ఎక్కడా ఆ నియమాన్ని పాటించడం లేదు. అంటే అర్హులైన ఓటర్లను జాబితాలోంచి తొలగిస్తూ అనర్హులను చేర్చుతున్నారని అర్థమవుతుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గంలో ఇలాంటి ఉదంతంపై బందరు వాసి ఇమడాబత్తిని దిలీప్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దొంగ ఓట్లను చేర్పించే కార్యక్రమం, ఇతర పార్టీల సానుభూతిపరులు ఓట్లను తొలగించే ప్రక్రియ ఇలాగే ప్రణాళికాబద్ధంగా జరుగుతోందని దిలీప్ కుమార్ స్పష్టంచేశారు.