Tractor Car Accident: రోగిని తీసుకెళ్తున్న కారుపై ట్రాక్టర్ బోల్తా.. ఆ తర్వాత.. - telugu breaking news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 18, 2023, 6:43 AM IST

Tractor Car Accident In Gajapathinagaram: విజయనగరం జిల్లాలోని గజపతినగరంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. నీలగిరి కర్రలతో వెళ్తున్న ట్రాక్టర్​ బోల్తాపడి కారుపై పడటంతో రోడ్డుపై ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  ట్రాక్టర్​లో ఉన్న నీలగిరి దుంగలు కారుపై ఒక్కసారిగా పడటంతో.. కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయిపోయింది.  మెంటాడ రూట్​ నుంచి నీలగిరి దుంగలతో నిండిన ట్రాక్టర్​.. రహదారి పైకి వస్తోంది. ఈ క్రమంలో గజపతినగరంలోని నాలుగు రోడ్ల జంక్షన్​ వద్దకు రాగానే అదుపు తప్పి.. విశాఖ నుంచి రాయ్​పూర్​ వెళ్తున్న కారుపై బొల్తా పడింది. ట్రాక్టర్​లోని నీలగిరి దుంగలు పూర్తిగా కారుపై పడ్డాయి. దీంతో కారు ముందు భాగం పూర్తిగా అణిగిపోయింది. ఈ ఘటనలో కారులో ఓ రోగిని తరలిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవటంతో వారు ఊపీరి పీల్చుకున్నారు. అంతేకాకుండా ట్రాక్టర్​ నడుపుతున్న వ్యక్తికి కూడా ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో ప్రమాదం తప్పింది. నీలగిరి దుంగలు రోడ్డుపై చెల్లచెదురుగా రోడ్డుపై పడటంతో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భారీ ట్రాఫిక్​జామ్​ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు కొంత సమయం వరకు ఇబ్బందులను ఎదుర్కోక తప్పలేదు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.