Cancellation of Tenders in Srisailam Temple: అధికార పార్టీ సలహాదారు ఒత్తిడితో రూ.110 కోట్ల టెండర్లు రద్దు.. తనవారికి రాలేదనే - Cancellation of tenders in Srisailam temple
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 11:04 AM IST
Cancellation of Tenders in Srisailam Temple: శ్రీశైల మహాక్షేత్రంలో అభివృద్ధి పనులకు సంబంధించి అధికార పార్టీకి చెందిన కీలక సలహాదారు తనవారికి బిడ్లు దక్కే అవకాశం లేదని తెలియడంతో ఏకంగా బిడ్లనే రద్దు చేయించారని తెలుస్తుంది. శ్రీశైలంలో కొత్తగా క్యూకాంప్లెక్స్, ఆలయ ముందు వైపు సాలుమండపాల నిర్మాణం కలిపి మొత్తం 110 కోట్ల రూపాయల మేర పనులకు ఇటీవల టెండర్లు పిలిచారు. పోటీ ఎక్కువగా ఉండటంతో టెండర్ల ప్రక్రియ కొనసాగిస్తే అంచనా వ్యయంలో 10 కోట్ల రూపాయల వరకైనా ఆలయానికి మిగిలేదని దేవాదాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. కానీ అనూహ్యంగా ఆలయ గత ఈవో లవన్న టెండర్లు రద్దు చేశారు. ఈ టెండర్ల రద్దు వెనుక ప్రభుత్వంలో కీలకంగా ఉండే సకల శాఖల సలహాదారు ఉన్నట్లు తెలిసింది. ఓ అమాత్యునికి కూడా ఈ వ్యవహారమంతా తెలిసినా.. మౌనంగా ఉన్నారని చర్చ జరుగుతోంది. టెండర్ల ప్రక్రియపై పాలకవర్గం ఆమోదం తీసుకోకపోవడంతో ఈ నిర్ణయంపై పాలకవర్గం ప్రశ్నించింది. వాళ్లు అధికార పార్టీకి చెందినవారే కావడంతో వ్యవహారం బహిర్గతం కాకుండా చూశారని సమాచారం. తాజాగా వీటికి సంబంధించి మళ్లీ టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు.