ఇసుక రవాణా బిల్లు పుస్తకాలు దహనం - అక్రమాలు బయటపడకుండా ఉండేందుకేనా?

🎬 Watch Now: Feature Video

thumbnail

Burnt Sand Transport Bill Books in Bapatla District: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం తమ్మవరం గ్రామ సమీపంలోని గుండ్లకమ్మ ఒడ్డున కాలిపోయిన ఇసుక రవాణా బిల్లు పుస్తకాలు వెలుగుచూశాయి. ఒంగోలుకు చెందిన గుత్తేదారు రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతి పొందిన జేపీ సంస్థ(JP Power Ventures Sand Mining)పేరుతో అద్దంకి నియోజకవర్గంలోని తమ్మవరం, అనమనమూరు, మోదేపల్లి గ్రామాల్లోని గుండ్లకమ్మ నదీ గర్భంలో డ్రెడ్జర్లతో ఇసుకను తవ్వి తరలించారు. 

Sand Smuggling in AP: అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. అనుమతి లేకపోయినా 9 నెలలు ఇసుక అక్రమ రవాణాకు(Illegal Sand Mining) తెరలేపి జేబులు నింపుకొన్నారు. రెండు రోజుల క్రితం బాపట్ల జిల్లా కలెక్టర్.. ఇసుక అక్రమాలపై అధికారులతో చర్చించి, బాధ్యులను గుర్తించాలని ఆదేశించారు. పట్టుబడకుండా గుత్తేదారు అందుకు సంబంధించిన బిల్లు పుస్తకాలను కాల్చివేశారన్న ప్రచారం జరుగుతోంది. కాలిపోకుండా ఉండిపోయిన కొన్ని బిల్లు పుస్తకాలను(Sand Transport Bill Books) స్థానికులు ఇళ్లకు తీసుకెళ్లి భద్రపరిచారు.

Last Updated : Nov 8, 2023, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.