పోలవరం పనుల్లో ప్రొక్లెయిన్ డ్రైవర్ గల్లంతు - గాలింపు చర్యలు షురూ - andhra pradesh news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 5:45 PM IST
Bulldozer Operator Drowned in Polavaram Project Works: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు అప్పర్ కాఫర్ డ్యామ్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రొక్లెయిన్ కూరుకుపోయిన ఘటనలో గల్లంతైన డ్రైవర్ కోసం గాలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అప్పర్- లోయర్ కాఫర్ డ్యామ్ మధ్యలో నీటిలో మునిగిపోయిన ప్రొక్లెయిన్ ఆచూకీ లభ్యమైనా డ్రైవర్ ఆచూకీ లభ్యం కాలేదు.
రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్యా ఇసుకను నింపుతూ నీటిలోకి జారిపోవటంతో ప్రొక్లెయిన్ మొత్తం ఇసుకలో కూరుకుపోయింది. మిషన్ క్యాబిన్ నుంచి బయటకు రాలేక ప్రొక్లెయిన్ ఆపరేట్ చేస్తున్న డ్రైవర్ జల్లి నాగేశ్వరరావు అందులోనే ఉండిపోయినట్టు తెలుస్తోంది. గల్లంతయ్యారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొన మండలం సామాంతపూరు గ్రామానికి చెందిన జె.నాగేశ్వరరావు (50) కొన్ని సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టులో ప్రొక్లెయిన ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. ప్రమాదవశాత్తు నదీ గర్భంలోకి ప్రొక్లెయిన్‌తో పాటు జారిపోవడంతో పైన ఇసుక పూడిపోయింది. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం డీప్ డ్రైవర్‌లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ఇసుక నింపుతున్న ప్రాంతంలో లోతు దాదాపు 20 మీటర్ల వరకూ ఉంటుండటంతో గాలింపు ప్రక్రియ ఇబ్బందిగా మారింది.