భల్లూకానికి సుస్తీ - మూడు రోజులుగా అవస్థలు, స్పందించని అటవీ అధికారులు - satya sai district latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 4:44 PM IST

Updated : Dec 16, 2023, 5:36 PM IST

Bulla Samudram Villagers Requesting Treatment for Sick Bear: అనారోగ్యంతో ఉన్న ఎలుగుబంటిికి వైద్యం అందించి అడవిలో వదిలిపెట్టాలని అటవీ అధికారులను బుల్లసముద్రం గ్రామస్థులు కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుల్ల సముద్రం గ్రామ సమీపంలో ఉన్న పొలాల్లో ఎలుగుబంటి సంచరిస్తోంది. మూడు రోజుల నుంచి ఎటూ నడవలేని స్థితిలో తోటలో ఉన్న ఎలుగుబంటిని గ్రామస్థులు గుర్తించారు. ఎలుగుబంటికి సుస్తీ చేయటంతో ఎటూ వెళ్లలేకపోతుందని అర్థం చేసుకుని అటవీ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించామని తెలిపారు.

Villagers Asked Forest Officers to Respond Give Treatment to Bear: ఎలుగుబంటి గురించి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించటం లేదని స్థానికులు చెబుతున్నారు. ఎలుగుబంటిని పరిస్థితి చూసి గ్రామస్థులు సైతం ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు నిర్లక్ష్యం వీడి వన్యప్రాణుల ప్రాణాలు కాపాడే దిశగా బాధ్యత వహించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఫారెస్ట్ అధికారులు వచ్చి బల్లూకానికి సరైన చికిత్స అందించి, సమీప అటవీ ప్రాంతాంలో విడిచి పెట్టాలని స్థానికులు తెలిపారు.

Last Updated : Dec 16, 2023, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.