Botsa Reaction on TDP and Janasena Alliance: టీడీపీ-జనసేన పొత్తు మేము ముందే ఊహించాం: బొత్స - Govt Medical College Inauguration in Vizianagaram
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 14, 2023, 10:44 PM IST
Botsa Reaction on TDP and Janasena Alliance: తెలుగుదేశం-జనసేన పొత్తు విషయం అందరూ ఊహించిందే.. ఇప్పటి వరకు ఆ పార్టీలు రెండు ముసుగు వేసుకున్నాయి.. ఇప్పుడు ముసుగు తీశాయని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విజయనగరం గాజులరేగ వద్ద నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి బొత్స, ఉత్తరాంధ్ర వైసీపీ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డితో కలసి పరిశీలించారు. ప్రారంభోత్సవంతో పాటు.. ముఖ్యమంత్రి సందర్శించనున్న ప్రయోగాశాల, మ్యూజియం, విద్యార్ధులతో ముఖాముఖి వేదిక ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధుల అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. టీడీపీ - జనసేన పొత్తు విషయం మాకంత ప్రాధాన్యం కాదన్నారు. మాకు, మా ముఖ్యమంత్రికి ప్రజా సంక్షేమం, ప్రజా అవసరాలు తీర్చటమే ముఖ్యమని తెలిపారు. అయినప్పటికీ టీడీపీ - జనసేన పొత్తు విషయం అందరూ ఊహించిందే అన్నారు. ఈ విషయం మాకు సెంకడరీ అని మంత్రి బొత్స ఈ సందర్భంగా పేర్కొన్నారు.