Bonda Uma on Avinash సీబీఐకి అందరూ భయపడుతుంటే.. ఏపీలో వైసీపీ సీబీఐని భయపెడుతోంది: టీడీపీ నేత బొండా - Accused in Viveka murder case
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18544170-437-18544170-1684498255518.jpg)
Bonda Uma comments on MP Avinash Reddy: సీబీఐకి దేశంలో అందరూ భయపడుతుంటే ఏపీలో వైసీపీ సీబీఐని భయపెడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వివేకా కేసులో పక్కాగా దొరికిపోయినా, ఇప్పటి వరకూ సీబీఐ అరెస్టు చేయలేకపోయిందన్నారు. సీబీఐ విచారణకు పిలిచిన ప్రతిసారి ఏదో ఒక వంకతో అవినాష్ రెడ్డి తప్పు కొంటున్నాడని విమర్శించారు. ఈ రోజు అమ్మకి ఆరోగ్యం బాగోలేదనని.. రేపు తమ ఇంట్లో కుక్క పిల్ల తప్పి పోయిందని చెపుతాడేమోనని బోండా ఉమా ఎద్దేవా చేశారు. దేశంలో ఇప్పటి వరకూ సీబీఐ ఈ విధంగా ఎవరికి అవినాష్ రెడ్డికి లాగా ఉదాసీనంగా ఉండలేదని అన్నారు. ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి వందల కోట్లు ఖర్చుపెడుతున్నాడని, ఆయనకి ఈ డబ్బు ఎవరు ఇస్తున్నారని బొండా ప్రశ్నించారు. వివేకా కేసులో అవినాష్ రెడ్డి చిన్న చేప అని.. అసలు తిమింగలాలు ఇంకా ఉన్నాయని ఆయన ఆరోపించారు. చిన్న చేపే సీబీఐని ఈ విధంగా చేస్తే తిమింగలాలు ఏం చేస్తాయో అంటూ బోండా ఉమామహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.