Bonda Uma on Jagan: ఆ తీర్పుతో చంద్రబాబుకేంటి సంబంధం?: బొండా ఉమా - Bonda Uma comments on Lingamaneni Guest House
🎬 Watch Now: Feature Video
Bonda Uma comments on Lingamaneni Guest House: ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేశ్ గెస్ట్ హౌస్ జప్తునకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. అయితే ఏసీబీ ఇచ్చిన తీర్పుతో టీడీపీ అధినేత చంద్రబాబుకేం సంబంధమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా చంద్రబాబు ఎలా లబ్ధి పొందుతారని నిలదీశారు. అది మా ఆస్తి కాదు.. మా పేరు మీద లేదు.. రమేష్ పేరు మీదే ఉంది.. అలాంటప్పుడు చంద్రబాబుకి సంబంధం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. చంద్రబాబుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. లింగమనేని రమేష్ చంద్రబాబు ఉండటానికి ఇల్లు ఇచ్చారనే నెపంతో ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయస్థానాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. గతంలో ఈ ప్రభుత్వానికి ఏసీబీ కోర్టు ఇదే కేసు విషయంలో చీవాట్లు పెట్టిందని అన్నారు. ఉండవల్లిలో తాను ఉంటున్న ఇంటికి చంద్రబాబు అద్దె చెల్లిస్తున్న ఆధారాలు ఇప్పటికే వెల్లడించామన్నారు. ఉన్నత న్యాయ స్థానాల్లో ప్రభుత్వానికి పరాభవం తప్పదని స్పష్టం చేశారు.