Flood Water at Railway Underpass: రైల్వే అండర్‌పాస్‌లో భారీగా వర్షపు నీరు.. 15 గ్రామాల ప్రజలకు అవస్థలు - బొడ్డేపల్లి లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Flood Water Stored at Railway Underpass: గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల ధాటికి శ్రీకాకుళం జిల్లాల్లోని ప్రధాన రహదారులు సైతం నీట మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో పొందూరు మండలం బొడ్డేపల్లి-తాడివలస రైల్వే అండర్‌పాస్‌లో భారీగా వర్షపు నీరు చేరింది. అక్కడ ఉన్న రైల్వే గేటును రైల్వేశాఖ మూసివేయటంతో వాహదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటిలో చిక్కుకున్న ఓ ఆటోను స్థానికులు బయటకు తీశారు. సుమారు 15 గ్రామాల ప్రజలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటారని స్థానికులు అంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవటంతో నీరు బయటకు వెళ్లటం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. తక్షణమే రైల్వే అధికారులు దీనిపై స్పందించి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు, వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. జనసేన నేతలు ఈ ప్రాంతాన్ని సందర్శించారు.