Somu Veerraju: 'చంద్రబాబు, పవన్ భేటీ గురించి సమాచారం లేదు' - comments about Chandrababu and Pawan Kalyan

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 30, 2023, 5:11 PM IST

BJP state president Somu Veerraju: టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ గురించి తనకు సమాచారం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ మన్​ కీ బాత్ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత కార్మికులతో కలిసి సోము వీర్రాజు వీక్షించారు. మోదీ పాలన 9 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. 

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై మే 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయాలి, ప్రభుత్వంపై ఛార్జ్​షీట్ దాఖలు చేయాలని.. రెండు కమిటీలు నియమించామని తెలిపారు. ఒక కమిటీ అంశాలను సేకరిస్తుందని, మరో కమిటీ.. ఏ విధంగా ఉద్యమం చేయాలని ప్లానింగ్ వేస్తుందని చెప్పారు. ప్రజా సమస్యలను సేకరిస్తామని.. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల.. అక్రమాలు, ఇసుక దోపిడీల గురించి తెలియజేస్తామని అన్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.