దరఖాస్తు చేయకుండానే ఓటర్ల వివరాలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు: బీజేపీ నేతలు
🎬 Watch Now: Feature Video
BJP Leaders on Irregularities in Voter List: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా ఓట్ల అక్రమాలను వైసీపీ నేతలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఫారం-7 దరఖాస్తులతో ప్రతిపక్షాల ఓట్లు తొలగించేందుకు వైసీపీ నేతలు చేస్తున్న కుట్రలు బట్టబయలవుతున్నా ఎన్నికల యంత్రాంగం మాత్రం పట్టించుకోవట్లేదనే ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ ఓట్లు మాత్రమే జాబితాలో ఉండాలి వేరే పార్టీ వారివి అయితే తీసేయాలి అనే పద్ధతి కొనాగుతోంది. ఈ చర్యలపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఆధారలతో అధికార పార్టీ అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. తాజాగా బీజేపీ నేతలు ఈ ఘటనలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
BJP leaders on YCP Leaders Irregularities in Voter List: తాజాగా అధికారపార్టీ నేతలు దరఖాస్తు చేయకుండానే ఓటర్ల వివరాలు మార్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. పోలింగ్ బూత్‌ను వారికి అనుకూలంగా ఉండేలా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఓటర్ల ఎపిక్ కార్డులు ఒక పార్టీ డౌన్ లోడ్ చేసిందని దీనికి సంబంధించిన రుజువులను ఎన్నికల సంఘానికి ఇచ్చామని రాష్ట్ర బీజేపి అధ్యక్షురాలు పురందేశ్వరీ వెల్లడించారు.