BJP Leader Satyakumar on Govt Emps Wages ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. జీతాలు ఎప్పుడు ఇస్తావ్ జగన్?: సత్యకుమార్ - BJP Leader Satya Kumar Slams CM Jagan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 3:56 PM IST
BJP Leader Satya Kumar Fire On YCP Government : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో (Government Did Not Pay Salaries to Government Employees in AP) కుటుంబ పోషణ కష్టమై.. ఉద్యోగులు అప్పులు చేస్తున్నారని కొంతమంది అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండల విద్యాశాఖాధికారి కార్యాలయం అకౌంటెంట్ బలవన్మరణానికి పాల్పడడం.. ఉద్యోగుల దీనస్థితికి అద్దం పడుతోందని ఆయన అన్నారు. స్వచ్ఛ భారత్ వర్కర్లకు ఐదు నెలలుగా.. 'సమగ్ర శిక్ష' టీచర్లకు నాలుగు నెలలుగా జీతాలు లేవని తమ దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకూ జీతాలు లేవని, ఐఏఎస్‌లకూ జీతాలు చెల్లించలేని దుస్థితికి ప్రభుత్వం వచ్చిందని మండిపడ్డారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద ఏటా కేంద్రం సగటున ఇస్తున్న15 వందల కోట్లు 'స్వచ్ఛ భారత్' కింద ఇస్తున్న వందల కోట్ల నిధులు ఐఏఎస్‌ల జీతాల కోసం ఇస్తున్న కన్సాలిడేటెడ్ ఫండ్స్ నిధులు ఏమవుతున్నాయని వైసీపీ ప్రభుత్వాన్ని సత్య కుమార్ ప్రశ్నించారు.