ప్రత్యేక న్యాయస్థానాల్లో కేసుల విచారణ - ఏ1 జగన్, ఏ2 విజయసాయి రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైంది: బీజేపీ - స్థానిక వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2023, 4:51 PM IST
BJP leader Kasi Viswanatha Raju comments on Jagan: రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన సాగుతోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథరాజు ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తితిదే (TTD) నిధుల దారిమళ్లించడాన్ని వ్యతిరేకించారు. ఇదే అంశంపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. ఇసుక దోపిడీ, పంచాయితీరాజ్ నిధుల దుర్వినియోగం, మద్యం కుంభకోణాల పై గణాంకాలతో సహా నిరూపిస్తున్న తమ పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వ్యక్తిగత విమర్శలతో దాడులు చేస్తున్నారని విశ్వనాథరాజు మండిపడ్డారు.
దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)... నకిలీ మద్యంతో దశలవారీగా ప్రజలను చంపేస్తున్నారని ఆరోపించారు. పెండింగ్ కేసులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సీజేఐకి లేఖ రాయడంతో... బెయిల్ పై ఉన్న రాజకీయ నాయకుల కేసులపై త్వరలోనే ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా విచారణ జరగనుందన్నారు. తద్వారా ఏ1 జగన్మోహన్ రెడ్డి, ఏ2 విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)కి కౌంట్ డౌన్ మొదలైందని కాశీ విశ్వనాథరాజు వైసీపీ (YCP) నేతలను హెచ్చరించారు.