BJP Leader Bhanuprakash on TTD Funds: తిరుపతి నగరాభివృద్ధి బాధ్యత ప్రభుత్వానిదే.. శ్రీవారి నిధుల ఖర్చు సరికాదు: భానుప్రకాశ్ - బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2023, 4:24 PM IST
BJP Spokesperson Bhanuprakash on TTD Funds: టీటీడీ నిధులను తిరుపతి కార్పోరేషన్‌కు మళ్లించాలనే ప్రభుత్వ ప్రయత్నంపై.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ స్పందించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. టీటీడీ నిధులను తిరుపతి కార్పొరేషన్‌కు మళ్లించే ప్రయత్నాన్ని ఆయన తప్పు పట్టారు. వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్ మిషనరీల నుంచి నిధులను తీసుకువచ్చి నగరాభివృద్ధికి ఖర్చు చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ధార్మిక చట్టానికి విరుద్ధంగా ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యే, టీటీడీ ఛైర్మన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులను తీసుకువచ్చి తిరుపతి అభివృద్ధికి ఖర్చు చేయాలని సవాల్ విసిరారు.
అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదని.. తిరుపతి నగరాభివృద్ధి బాధ్యత ప్రభుత్వానిదని గుర్తు చేశారు. వైసీపీ నాయకుల లబ్ది కోసం శ్రీవారి నిధులను ఖర్చు చేయటం సబబు కాదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై చేసిన వ్యాఖ్యలపై భానుప్రకాశ్ స్పందించారు. జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. జగన్ చేసిన వ్యాఖ్యలు సరికావని.. ఆయన చేసిన దిగజారుడు మాటలను వెనక్కి తీసుకోవాలని అన్నారు.