పక్షులు ట్రెండ్ మార్చాయా.. ఈ మట్టి గూళ్లే నిదర్శనమా..!
🎬 Watch Now: Feature Video
Birds Nests: పిచ్చుకలు.. ఆకులు, గడ్డి పరకలతో చెట్లపై గూళ్లు కట్టుకోవడం మనం చూశాం. తెలంగాణలోని కరీంనగర్ శివారులోని దిగువ మానేరు వద్ద ఉన్న ఈ గూళ్లు చూస్తే మాత్రం.. పిచ్చుకలు కూడా ట్రెండ్ మార్చుకున్నాయా అన్న అనుమానం కలగకమానదు. దిగువ మానేరు డ్యాం హెడ్ రెగ్యులేటర్ గేట్ల సిమెంట్ దిమ్మెలకు.. వందల కొద్ది పక్షులు మట్టితో గూళ్లు నిర్మించుకున్నాయి. మట్టితో నిర్మించుకున్న ఈ గూళ్లు.. ఇంజినీరింగ్ నైపుణ్యంతో కూడిన వాటిలా కనిపిస్తున్నాయి. ఆ గూళ్లలో నివసిస్తూ.. డ్యాం పరిసరాల్లో రయ్.. రయ్.. అంటూ ఎగురుతూ కిలకిలరావాలతో సరికొత్త ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఓవైపు మానేరు డ్యాం అలల సవ్వళ్లు, మరోవైపు పక్షుల కిలకిల రావాలు.. చూపరులకు అమితానందాన్నిస్తున్నాయి.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST