యువగళం పాదయాత్ర ముగింపు సభలో ప్రత్యేక ఆకర్షణ - పసుపు రంగు స్కూటర్ ఫేమస్ - స్కూటర్కు పసుపు రంగు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 5:34 PM IST
Bike Special Attraction in Yuvagalam Ending meeting : తెలుగుదేశంపై తమకున్న అభిమానాన్ని ఓ కార్యకర్త వినూత్నంగా చాటుకున్నాడు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నుంచి ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ద్విచక్రవాహంపై యువగళం ముగింపు సభకు వచ్చాడు. పసుపు రంగు వేసిన స్కూటీకి మైక్ ఏర్పాటు చేసి తెలుగుదేశం, జనసేన జండాలు కట్టి సభా ప్రాంగణం వద్ద ఆకర్షణగా నిలిచాడు. దాదాపు 300 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణించి సభకు హాజరయ్యాడు.
హోండా కంపెనీకి చెందిన స్కూటర్కు పసుపు రంగు వేసి ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, నందమూరి బాలకృష్ణ ఫొటోలను వాహనంపై చిత్రీకరించి తెలుగుదేశం పార్టీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. అంతే కాకుండా స్కూటర్ వెనుక భాగంలో స్పీకర్లు ఏర్పాటు చేసి తెలుగుదేశం కార్యకర్తలను ఉత్తేజపరిచే పాటలను మోగించేలా రూపొందించారు. ముగింపు సభకు దగ్గరలో పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాలకు ఆగిన ప్రదేశంలో ఆయన వాహనం చూసి పలువురు ఆకర్షితులయ్యారు. వాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించడంతో పలువురు ద్విచక్ర వాహనంపై ఎక్కి సెల్ఫీలు దిగారు.