బైకును ఢీకొట్టి 20కిమీ ఈడ్చుకెళ్లిన లారీ - స్వల్ప గాయాలతో బయటపడ్డ యువకుడు - ఏపీ లేటెస్ట్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 1:44 PM IST

Updated : Nov 13, 2023, 5:27 PM IST

Bike Accident in Eluru District: ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కొయ్యలగూడెం వద్ద ఓ లారీ బైకును ఢీకొట్టి సుమారు 20కిలోమీటర్లు జాతీయ రహదారిపై ఈడ్చుకెళ్లింది. అదృష్టవశాత్తూ ద్విచక్ర వాహనదారుడు స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం నుంచి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్ జంక్షన్ వరకు దిచక్రవాహనాన్ని లారీ ఈడ్చుకు వెళ్లింది. 

Lorry Hit A Bike: కొయ్యలగూడెం పోలీసులకు దేవరపల్లి పోలీసులు సమాచారం ఇవ్వడంతో లారీని అడ్డగించారు(Police Stopped Lorry). అక్కడికి చేరుకున్న వాహనదారుడి స్నేహితులు లారీ డ్రైవర్‌పై గొడవకు దిగారు. పోలీసులు వారికి నచ్చచెప్పి.. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌(Police Station)కు తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంలో(Road Accident) లారీ కింద ఇరుక్కున్న ద్విచక్ర వాహనం తుక్కు తుక్కుగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Nov 13, 2023, 5:27 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.