Bhuvaneshwari met Yuvagalam volunteers యువగళం వాలంటీర్ల త్యాగాన్ని గుర్తు పెట్టుకుంటాం: భువనేశ్వరి - lokesh youvaghalam news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 7:40 PM IST
Bhuvaneshwari met Yuvagalam volunteers: లోకేశ్ చేపట్టిన యువగళం ద్వారా తెలుగుదేశంకు సేవ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్ల సేవలు మరిచిపోలేనివని నారా భువనేశ్వరి (Bhuvaneshwari) అన్నారు. యవగళంలో లోకేశ్ తో పాటు సాగుతున్నారనే కారణంతోనే వాలంటీర్లపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆమె అన్నారు. పార్టీ కోసం జైలుకు వెళ్లిన వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు. పాదయాత్ర ప్రారంభం నుంచి లోకేశ్(Lokesh) కు వెన్నంటి ఉంటున్న యువగళం( Yuvagalam ) వాలంటీర్లకు భువనేశ్వరి కృతజ్ఞతలు చెప్పారు.
బెయిల్ పై బయటకు వచ్చిన వాలంటీర్లను నారా భువనేశ్వరి కలుసుకున్నారు. ఆమె వారి యోగక్షేమాలు అడిగి తెలుసున్నారు. చేయని నేరానికి జైలుకు వెళ్లడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ల (volunteers) కష్టం, త్యాగం తాము ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటామని భువనేశ్వరి అన్నారు. గత నెల 5న భీమవరం నియోజకవర్గం గునుపూడిలో యువగళం పాదయాత్రపై వైసీపీ శ్రేణులు రాళ్లదాడికి పాల్పడ్డాయి... అల్లరిమూకల్ని అదుపు చేయని పోలీసులు బాధితులైన వాలంటీర్లపైనే 307 సెక్షన్ల కింద కేసులు పెట్టారని విమర్శలు వెల్లువెత్తాయి. భీమవరం కోర్టు గత నెల 6న రిమాండ్ విధించింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండులో ఉన్న వాలంటీర్లు ఇవాళ బెయిల్ పై 39 మంది విడుదలయ్యారు.