పంట పొలాల్లో హల్చల్ చేసిన భల్లూకం - భయభ్రాంతులకు గురైన గ్రామస్థులు - bear crop damage
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2024, 3:15 PM IST
Bear Roars in the Crop Fields : శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి పంట పొలాల్లో హల్చేల్ చేసింది. గత కొన్ని రోజులుగా మందస మండలం రట్టి గ్రామ ప్రజలకు ఎలుగుబంటి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. గ్రామ సమీపంలోని జీడి, మామిడి తోటలో అలజడి చేస్తున్న ఎలుగుబంటి చూసి గ్రామస్థులు భయభ్రాంతులకు గురయ్యారు. కళ్ల ఎదుటనే ఎలుగుబంటి పంటపొలాలను నాశనం చేస్తున్న ఏమి చేయాని నిస్సహాయ పరిస్థితిలో రైతులు ఉన్నారు.
Bear Destroying Crop Fields : స్థానికంగా అటు ఇటు తిరుగుతూ కాసేపు చక్కర్లు కొట్టిన ఎలుగుబంటి నెమ్మదిగా తోటలోకి వెళ్లిపోయింది. సమీపంలోని కొండల నుంచి ఎలుగుబంట్లు గ్రామాల్లోకి చొరబడి భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంట్లు పొలాల్లో తిరుగుతూ పంటను నాశనం చేస్తున్నాయని వాపోతున్నారు. ఎలుగుబంట్లు బారి నుంచి రట్టి గ్రామ ప్రజలను రక్షించాలని, అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అధికారులు స్ఫందించి ఎలుగుబంట్లు తమ పొలాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు.