Female Bear Died: అనుమానాస్పద స్థితిలో ఎలుగుబంటి మృత్యువాత.. - ఉచ్చు తగిని చనిపోయిన ఎలుగుబండి
🎬 Watch Now: Feature Video
Bear Died in Suspicious Circumstances at Hukumpeta : అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ బోలోర్డ సమీపంలో ఓ ఎలుగుబంటి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మంగళవారం స్థానిక కొండపైకి వెళ్లిన గిరిజనులకు అనుమానాస్పద స్థితిలో.. ఎలుగుబంటి కొన ఊపిరితో కొట్టుకుంటున్న దృశ్యం కనిపించింది. గ్రామస్థులు దాని పరిస్థితిని గమనించారు. వెంటనే వారు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఆ జంతువు పరిస్థితి చూసి చలించిపోయిన గిరిజనులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఘటన స్థలానికి అటవీశాఖ డీఎఫ్ఓ వినోద్ కుమార్ చేరుకున్నారు. అనంతరం ఎలుగుబంటిని పరిశీలించారు. అప్పటికే ఎలుగుబంటి మృతి చెందింది. ఏదో ఉచ్చులో పడి మృతి చెందినట్లుగా అధికారులు గుర్తించారు. పశు వైద్యులు చరణ్ పోస్టుమార్టం నిర్వహించారు.
ఎలుగుబంటి వయస్సు 11 సంవత్సారాలు నిండి ఉంటుందని, ఆడ ఎలుగుబంటిగా అధికారులు గుర్తించారు. ఎలుగుబంటి కళేబరాన్ని కొండ అడవిలో దహనం చేశారు. ఎవరైనా కావాలనే ఉచ్చు ఏర్పాటు చేశారా? లేక ఎలుగుబండి మృతి చెందడానికి ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అని అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు.