కళ్యాణకట్ట క్షురకులను మనుషులుగా చూడాలి - టీటీడీ తీరుపై నాయీబ్రాహ్మన సంఘం ఆవేదన
🎬 Watch Now: Feature Video
Barbers Meeting in TTD : టీటీడీ కల్యాణ కట్టలో పనిచేసే క్షురకులను మనుషులుగా చూడాలని తొలగించిన 49 మంది కార్మికులను వెంటనే విధుల్లో కి తీసుకోవాలని తిరుమల కళ్యాణకట్ట నాయీబ్రాహ్మన సంఘం డిమాండ్ చేసింది. తిరుమల కళ్యాణ కట్ట నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తితిదే కల్యాణ కట్ట క్షురకులతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.
Barbers Protest On TTD Management : గత కొన్ని సంవత్సరాలుగా తిరుమలలో పనిచేసే కళ్యాణకట్ట క్షురకులను యాజమాన్యం వేధింపులు గురి చేస్తోందని కేఓడీ పద్ధతి పేరుతో 49 మందిని తొలగించడాన్ని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి ఖండించారు. క్షురకులు ఎక్కడ అవినీతికి పాల్పడడం లేదని తితిదే యాజమాన్యం తమను అకారణంగా వేధిస్తోందని క్షురకులు ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి సాకుతో కళ్యాణ కట్టల్లో క్షురకులను వేధించడమే కాకుండా ప్రశ్నించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు.