టిడ్కో లబ్ధిదారులకు షాక్ ఇస్తున్న బ్యాంకర్లు - ఇళ్లు అప్పగించకముందే రుణ వాయిదా నోటీసులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 3:10 PM IST
Banks Notices to TIDCO Beneficiaries : టిడ్కో ఇళ్లను అందించకముందే రుణ వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకు నుంచి సందేశాలు రావడం లబ్ధిదారులకు ఆందోళనకు గురిచేస్తోంది. కొందరికైతే బ్యాంకుల నుంచే నేరుగా ఫ్లోన్లు వస్తుండటం కలవరపెడుతోంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు పరిధిలోని జెమిని స్కూల్ సమీపన, నాగన్నగూడెంలోనూ టిడ్కో గృహ సముదాయాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇళ్ల నిర్మాణం పూర్తి కాకముందే బ్యాంకు నోటీసులు ఏంటని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
Tidco Houses Falling Into Disrepair : గత ప్రభుత్వ హయాంలో ఉయ్యూరులో టిడ్కో ఇళ్లు నిర్మాణ పనులు 70 శాతం పూర్తి అయ్యాయి. అంతలోనే ఎన్నికలు సమీపించి ప్రభుత్వం మారింది. కొత్తగా అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీ ప్రభుత్వానికి వాటిని పూర్తి చేయడానికి మనస్సు ఒప్పలేదు. ఇప్పుడు ఆ టిడ్కో ఇళ్లు శిథిలావస్థకు చేరుకునే దశలో ఉన్నాయి. పలుచోట్ల టిడ్కో ఇళ్లను నిర్మించినా సరైన మౌలిక సదుపాయాలు కల్పించకుండానే అందించడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు టిడ్కో ఇళ్లను పూర్తి చేయకుండా తమకు ఇవ్వకుండానే బ్యాంకులు డబ్బులు కట్టాలని చెప్పడంపై లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.