Bandaru Comments on YCP Leaders: మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్న బండారు - టీడీపీ ఆన్ రోజా
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-10-2023/640-480-19678812-thumbnail-16x9-bandaru-comments.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2023, 4:07 PM IST
Bandaru Comments on YCP Leaders: మహిళలంటే తనకెంతో గౌరవం ఉందని.. గౌరవంతో బతికే కుటుంబాలపై మంత్రి రోజా(Roja) ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడబట్టే ఆమెకు బుద్ధి చెప్పానని మాజీ మంత్రి బండారు(Bandaru) సత్యనారాయణ మూర్తి అన్నారు. తనపై పెట్టిన కేసు లో అదృష్టం న్యాయదేవత రూపంలో నిలబడిందని తెలిపారు. ఉరి శిక్షకైనా సిద్ధం తప్ప దుర్మార్గపు చర్యలతో జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని భయపెట్టలేరని హెచ్చరించారు. ఉండే 4మాసాలైనా బుద్ధిమార్చుకుంటే జగన్(Jagan) కే మంచిదని హితవు పలికారు.
ఒకవేళ నా సంతకం ఫోర్జరీ జరిగితే నేను చెప్పాలి కానీ, హైకోర్టు లో నా సంతకం ఫోర్జరీ అని ప్రభుత్వం చెప్పటం విడ్డూరమని ఎద్దేవా చేశారు. సాటి మహిళల్ని కూడా కించపరిచే మంత్రి రోజాపై తాను చేసిన వ్యాఖ్యలను ఎంతోమంది మహిళలు సమర్ధించారన్నారు. రోజాపై తాను చేసిన వ్యాఖ్యలకు వచ్చిన స్పందనను ముఖ్యమంత్రి కూడా విశ్లేషించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం కార్యాలయంలో ఆయన ఎన్టీఆర్(NTR) విగ్రహానికి నివాళులర్పించారు.