Balakrishna Reached Rajahmundry: రాజమండ్రి చేరుకున్న బాలకృష్ణ.. లోకేశ్‌, పవన్‌కల్యాణ్‌తో కలిసి చంద్రబాబుతో ములాఖత్‌.. - East Godavari District Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2023, 11:48 AM IST

Balakrishna Reached Rajahmundry: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌ నుంచి రాజమండ్రి చేరుకున్నారు. సోదరి భువనేశ్వరి, కూతురు బ్రహ్మణితో సమావేశమైన ఆయన.. వారిని పరామర్శించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు బాధాకరమని విచారం వ్యక్తంచేశారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తోనూ బాలకృష్ణ భేటీ కానున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ముగ్గురి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబుతో ఈ ముగ్గురు.. మధ్యాహ్నం 12 గంటలకు ములాఖత్‌ కానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపైనా నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. కేవలం రాజకీయ కక్షలో భాగంగానే.. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. 16 రోజులైనా చంద్రబాబును జైలులో పెట్టాలన్నదే జగన్‌ కుట్ర అని బాలకృష్ణ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ (State Future)కోసం ప్రతిఒక్కరూ ఉద్యమించాల్సిన తరుణం ఇదే అని బాలకృష్ణ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.