Bail to Amaravati Farmers: అమరావతి రైతులకు ఊరట.. బెయిల్ మంజూరు
🎬 Watch Now: Feature Video
Bail Granted to Amaravati Farmers: ఆర్ 5 జోన్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన దొండపాడు రైతులకు మంగళగిరి న్యాయస్థానంలో ఊరట లభించింది. వ్యక్తిగత పూచీకత్తుపై అమరావతి రైతులను విడుదల చేయాలని పేర్కొంది. ఆర్ 5 జోన్‌ను వ్యతిరేకిస్తూ దొండపాడు వద్ద రైతులు జంగిల్ క్లియరెన్స్ పనులను అడ్డుకున్నారు. జంగిల్ క్లియరెన్స్ పనులను అడ్డుకుంటుండగా తనపై పెట్రోల్ చల్లారంటూ ఆనందరావు అనే సీఐ.. తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన మరో సీఐ శేషగిరిరావు.. ఆరుగురు రైతులతో పాటు మరో 17 మందిపై పలు సెక్షన్లు కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన రైతుల్ని ఇవాళ మంగళగిరి న్యాయస్థానంలో పోలీసులు హాజరుపర్చారు. రిమాండ్ రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయమూర్తి.. సెక్షన్ 326-A కింద పెట్టిన కేసు రైతులకు వర్తించదన్నారు. వారందర్ని రిమాండ్ బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించారు. కోర్టు నుంచి సమన్లు వచ్చినప్పుడు తిరిగి విచారణకు హజరుకావాలని రైతుల్ని ఆదేశించారు.