రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే టీడీపీ - వెనక్కు నడవాలంటే వైసీపీ : వరదరాజులు రెడ్డి - ప్రొద్దుటూరులో బాబు హామీ కార్యక్రమం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 12:32 PM IST

Babu Surety Bhavisyathuku Guarantee Programme in Proddatur : వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని, తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే పూర్వ వైభవం వస్తుందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి అన్నారు.  వైఎస్సార్సీపీ అరాచక పాలన పోయి రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్నా, సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పాలనలో జరుగుతున్న అరాచకాలను తరిమికొట్టాలన్నా తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ నారా చంద్రబాబు నాయుడును మరోసారి సీఎంని చేయాలని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి వెనక్కు నడుస్తోందని వరదరాజుల రెడ్డి ఎద్దేవా చేశారు.

Nandyala Varada Rajulu Reddy Fire on CM jagan : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల  వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు.  పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి  తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళిక అంశాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. టీడీపీ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని, అందరూ ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.