అవనిగడ్డలో పంబా ఆరట్టు - అయ్యప్ప మాలధారుల విశేష మహోత్సవం - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2023, 8:08 PM IST
Ayyappa Swamulu Krishna Aarat Utsavam In Avanigadda : అయ్యప్ప స్వాములు కృష్ణానది తీరాన 'పంబా ఆరట్టు' ఉత్సవం వైభవంగా నిర్వహించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో వందలాది మంది అయ్యప్ప మాలధారులు కలిసి కృష్ణ ఆరాట్ (హారతి) కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములు పురవీధుల్లో భజనలు చేస్తూ ఎరుమేలిలో మాదిరిగా పేటతుళ్లి ఆడుకుంటూ అయ్యప్ప నామస్మరణ చేస్తూ ఆడిపాడారు. స్థానిక లంకమ్మ అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
Ayyappa Swamula Celebrations in krishna District : అనంతరం స్థానిక కృష్ణా నది తీరాన పంబ ఆరట్టు మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు కేరళ సాంప్రదాయ ప్రకారం అయ్యప్ప స్వాములు శబరిమల పంపానది ఒడ్డున నిర్వహిస్తారు. అదే తరహాలో ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప మాలధారులు, శివమాలధారులు, భవానీలు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామివారిని కొలిచారు. స్వాములు అందరూ కలసి ఒకే చోట వేడుకలు నిర్వహించుకోవడం కనుల పండువగా ఉంది. పోటెత్తిన భక్త జనులతో అయ్యప్పల సంబరాలు అంబరాన్నంటాయి.