Ayodhya Ram Mandir Maha Yantram: అయోధ్య రామాలయ మహాయంత్రం గుంటూరు జిల్లాలో తయారీ - Ayodhya Ram Mandir Maha Yantra

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 10, 2023, 10:42 AM IST

Ayodhya Ram Mandir Maha Yantram: అయోధ్య రాముడి గర్భాలయ మూల విరాట్ కింద ప్రతిష్ఠించనున్న రామ మహాయంత్రాన్ని గుంటూరు జిల్లాలో రూపొందించారు. తెనాలి మండలం అంగలకుదురులోని శ్రీవాసుదాస స్వామి పీఠంలో శ్రీమాన్ డాక్టర్ అన్నదానం చిదంబరశాస్త్రి ఈ మహాయంత్రాన్ని తయారు చేశారు. దీనిని ఆంధ్ర వాల్మీకి శ్రీవాసుదాస స్వామి వారి పరంపర పీఠం, శ్రీకోదండరామ సేవక ధర్మ సమాజం (దాసకుటి ఆశ్రమం)లో భక్తుల దర్శనార్ధం ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం 11:30 గంటల నుంచి 12.30 గంటల వరకు గంట పాటు ఈ యంత్రం ఆశ్రమంలో ఉంచగా.. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ మహాయంత్రానికి ఆశ్రమంలో ఆదివారం అన్నిరకాల పూజాదికాలు నిర్వహించారు. ఆ తర్వాత అయోధ్య రామమందిరం ట్రస్ట్ నిర్వాహకులు ఆ మహాయంత్రాన్ని ఆయోధ్యకు తీసుకెళ్లారు. ఏ ఆలయంలోనైనా మూలవిరాట్‌ ఏర్పాటుకు ముందు మహాయంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. మంత్రశక్తిని ఆ మహాయంత్రానికి ఆపాదిస్తారు. అలాంటి మహాయంత్రం గుంటూరు జిల్లాలో రూపొందించారు. అయితే ఆశ్రమ నిర్వాహకులు ఆ విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.