Attack On RTC Bus Driver హేయమైన చర్య.. హారన్​ కొట్టాడని విచక్షణ రహితంగా ఆర్టీసీ డ్రైవర్​పై దాడి..! - నెల్లూరులో అర్టీసీ డ్రైవర్​పై దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2023, 9:17 PM IST

Attack On RTC Bus Driver: విధి నిర్వహణలో ఉన్న ఓ అర్టీసీ డ్రైవర్​పై విచక్షణరహితంగా దాడి చేసి, తీవ్రంగా గాయపర్చిన ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. బస్సుకు అడ్డుగా ఉన్న బైక్​ను తీయమని డ్రైవర్​ హరన్​కొట్టడన్న నెపంతో.. ఆర్టీసీ బస్సు డ్రైవర్​తో వాదనకు దిగి, బస్సును వెంబడించి డ్రైవర్​పై మూకుమ్మడి దాడికి దిగారు. బస్సు నుంచి డ్రైవర్​ను దింపి మరి విచక్షణరహితంగా, దుర్భాషలాడుతూ కాలితో తన్నుతూ కొట్టారు. గురువారం రోజున జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో వైరల్​గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిధిలో చర్చానీయంశంగా మారింది. 

అసలేంజరిగిందంటే.. విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. నెల్లూరు జిల్లాలోని కావలి నుంచి విజయవాడకు బయల్దేరింది. ఈ క్రమంలో కావలిలోని ట్రంకురోడ్డులో బస్సుకు అడ్డుగా ఉన్న బైక్​ను తొలగించాలని.. డ్రైవర్​ రాంసింగ్​ హారన్​కొట్టాడు. దీంతో ఆ ద్విచక్రవాహనాదారుడు రాంసింగ్​పై వాదనకు దిగాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు సర్ది చెప్పి వారిని అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనతో కోపోద్రిక్తుడైన ఆ ద్విచక్రవాహనదారుడు.. తన మిత్రులకు విషయం తెలియజేసి వారితో కలిసి ఆర్టీసీ బస్సును వెంబడించాడు. పట్టణ శివారులో మద్దూరుపాడు వ్యవసాయ మార్కెట్​ గోదాముల వద్దకు చేరుకోగానే అందరు కలిసి బస్సును అడ్డుకున్నారు. అంతేకాకుండా బస్సు దిగిన ఆర్టీసీ డ్రైవర్​పై దాడికి దిగారు. విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్​పై విచక్షణ రహితంగా దాడి చేస్తూ నానా దుర్భాషలాడారు. ఈ ఘటనను ఓ ప్రయాణికుడు వీడియో తీయగా అతనిపై దాడి చేసి.. చరవాణిని తీసుకుని పగలగొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాయాలపాలైనా డ్రైవర్​ను కావలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.