Tension at Tadikonda PS: దళిత యువకులపై దాడి.. తాడికొండ పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత - మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-06-2023/640-480-18828143-715-18828143-1687519328545.jpg)
Tension at Tadikonda Police Station: గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ స్థానిక మాల నాయకులతో కలిసి పోలీస్‌స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. గురువారం రాత్రి తాడికొండ మండలం కంతేరు గ్రామంలో దళిత యువకులపై అదే గ్రామానికి చెందిన ఒక సామాజిక వర్గానికి చెందినవారు దాడి చేశారని అరుణ్‌కుమార్ తెలిపారు. దాడిలో ముగ్గురు దళిత యువకులకు తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. అందులో శామ్యూల్ అనే యువకుడిని కారులో బలవంతంగా ఎక్కించి.. దారిలో అతనిపై చేతులతో దాడి చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద విడిచి పెట్టారని ఆరోపించారు. ఈ సంఘటనపై పోలీసులు ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. దళితులకు న్యాయం జరిగే వరకు ఊరుకోమని తేల్చిచెప్పారు. దళితులపై ఇంత దారుణంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ పోలీస్‌స్టేషన్ ముందు రోడ్డుపై కూర్చొని నిరసన తెలుపుతామని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.