కాంగ్రెస్ నేత ఇంటిపై అర్ధరాత్రి దాడి - వాహనాలు ధ్వంసం, యువకుడికి గాయాలు - కాంగ్రెస్‌నేత ప్రతాప్‌రెడ్డి తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 25, 2023, 1:11 PM IST
Attack on Congress Leader Prathap Reddy Home In Anantapur District : అనంతపురంలోని కాంగ్రెస్ నేత (Congress Leader) ప్రతాప్‌రెడ్డి ఇంటి పై గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. అర్ధరాత్రి వేళ రాళ్ల దాడి చేయడంతో ఇంటి ముందు ఉన్న ఆయన వాహన అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇంటి పై రాళ్లు పడుతున్నట్టు శబ్దం రావడంతో పక్కింటి యువకుడు బయటికి వచ్చాడు. దుండగులు తనపైనా రాళ్లతో దాడి చేశారని యువకుడు తెలిపాడు.
Unknown Attacked Prathap Reddy's House with Stones : రాళ్లు రువ్వడంతో ఈ దాడిలో గౌతమ్ అనే యువకుడి తలకు గాయమైంది. దుండగులు ఇంటి పై రాళ్లు రువ్వడాన్ని గమనించి చుట్టుపక్కల వారు బయటకు వచ్చి కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. దాడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని ప్రతాపరెడ్డి (Prathap Reddy) తెలిపాడు. ఇదిలా ఉండగా గతంలో ముసుగులో వచ్చిన యువకులు పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయంపైనా దాడి చేయడం గమనార్హం.