Earthquake in Prakasam District: ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ఎక్కువగా చోటుచేసుకోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. తాజాగా ఇవాళ ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం సంభవించింది. 24 గంటల్లో రెండోసారి జిల్లాలో భూమి కంపించడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవాళ ముండ్లమూరు మండలంలో సెకన్ పాటు భూమి కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ఇళ్లలో నుంచి బయటకు వచ్చామని స్థానికులు తెలిపారు.
శనివారం కూడా ఇదే ప్రాంతంలో ముండ్లమూరు, తాళ్లూరు మండాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించంతో ప్రజలు ఆందోళనకు గురైయ్యారు. ముండ్లమూరు, పసుపుగల్లులో వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు, తాళ్లూరు, శంకరాపురం, పోలవరం, గంగవరం, రామభద్రాపురం, శంకరాపురంలో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలోనే ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు వచ్చారు. పలు గ్రామాల్లో రెండు సెకండ్లపాటు భూకంపం సంభవించడంతో ఇళ్లలోని వస్తువులన్ని కదిలాయి. ఈరోజు కూడా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
భూప్రకంపనలపై దృష్టిసారించిన ప్రభుత్వం: ప్రకాశం జిల్లాలో వరుస భూప్రకంపనలపై ప్రభుత్వం దృష్టిసారించింది. దర్శి నియోజకవర్గంలో భూ ప్రకంపలపై మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తరచుగా ఆ ప్రాంతంలో భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్తో మాట్లాడి తెలుసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలతో కూడా చర్చించాలని సూచించారు. భూ ప్రకంపనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. భూప్రకంపనలపై ప్రజలు ధైర్యంగా ఉండావాలని భయభ్రాంతులకు గురికావద్దని విజ్ఞప్తి చేశారు.
గుజరాత్లో భూకంపం- రిక్టర్ స్కేల్‌పై 3.7తీవ్రత నమోదు
హిమాచల్‌లో భూకంపం- భయంతో ప్రజలు పరుగే పరుగు! - Earthquake In Himachal Pradesh